- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేనమామను నరికి చంపిన అల్లుడు
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: మేనమామను అల్లుడు కత్తితో నరికి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామ వడ్డెరకాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లెం నడిపి రాజం అనే 60 ఏళ్ల వ్యక్తి.. అతడి అల్లుడు శివరాత్రి అంజయ్యకు కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇదేక్రమంలో అప్పుడప్పుడు గొడవపడిన సందర్భాలున్నాయి. దీంతో రాజంపై కక్ష పెంచుకున్న అంజయ్య… ఆదివారం సాయంత్రం వడ్డెరకాలనీలోని హోటల్ వద్ద ఉన్న రాజంపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మేనమామను అల్లుడు కత్తితో నరికి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామ వడ్డెరకాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లెం నడిపి రాజం అనే 60 ఏళ్ల వ్యక్తి.. అతడి అల్లుడు శివరాత్రి అంజయ్యకు కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇదేక్రమంలో అప్పుడప్పుడు గొడవపడిన సందర్భాలున్నాయి. దీంతో రాజంపై కక్ష పెంచుకున్న అంజయ్య… ఆదివారం సాయంత్రం వడ్డెరకాలనీలోని హోటల్ వద్ద ఉన్న రాజంపై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు అంజయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
Next Story






