ఎమ్మార్వో ఆఫీసులో తండ్రికి బదులు కొడుకు ఉద్యోగం

by  |
ఎమ్మార్వో ఆఫీసులో తండ్రికి బదులు కొడుకు ఉద్యోగం
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల ఉప్పునుంతల తహశీల్ధార్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలు పలువురుని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని మండల ప్రజలు వాపోతున్నారు. శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ బాలాజీ విధులను ఆయన కొడుకు నిర్వహిస్తూ మీడియాకు అడ్డంగా దొరికాడు. శనివారం అనుకోకుండా కార్యాలయానికి మీడియా మిత్రులు వెళ్లగా జూనియర్ అసిస్టెంట్ కుమారుడు రికార్డుల గదిలో రికార్డులను అటూ ఇటూ మారుస్తూ కంట పడ్డాడు. తక్షణమే అతడు విధులు నిర్వహిస్తున్న తీరును మీడియా ప్రతినిధులు వీడియో తీస్తుండగా.. మీడియాపై తిట్ల వర్షం కురిపించాడు.

తండ్రికి బదులుగా కొడుకు విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో మండల ప్రజలు రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను మార్చే కుట్రలు జరుగుతున్నాయాననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో కృష్ణయ్య జూనియర్ అసిస్టెంట్‌ను తన చాంబర్‌కి పిలిచి ఘాటుగా మందలించినట్లు తెలిసింది. నీకు బదులుగా నీ కుమారుడు రికార్డులున్నా కార్యాలయంలో ఏం చేస్తున్నాడు అని మందలిస్తూ మరోసారి ఇలాంటిది జరిగితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో హెచ్చరించినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ తండ్రికి బదులుగా కొడుకు రికార్డుల గదిలో ఉండటం పలువురికి అనుమానాలను తెర లేపుతుందని మండల ప్రజల చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed