- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చారిత్రక కట్టడాలను కాపాడిన ఘనత కేసీఆర్‌ది: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
<p>దిశ,ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను, ఆలయాలను, మసీదులను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా, ఆర్కియాలజీ, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హయత్‌నగర్‌లోని `హయత్ బక్షి మసీదు`ను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను కాపాడుతూ, ప్రసిద్ధి […]</p>

దిశ,ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను, ఆలయాలను, మసీదులను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడా, ఆర్కియాలజీ, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హయత్‌నగర్‌లోని 'హయత్ బక్షి మసీదు'ను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తలతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను కాపాడుతూ, ప్రసిద్ధి గాంచిన కవులు, కళాకారుల ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రామప్ప ఆలయంతో పాటు కుతుబ్‌షాహి టూంబ్స్, హయత్ బక్షి వంటి అనేక రకాలైన పురాతన కట్టడాలను కాపాడుకుంటూ, మన వారసత్వ సంపదను భద్రపరచడంతో పాటు దానికి తగిన గుర్తింపు వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హయత్ బక్షి మసీదును రూ. 2.5 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజా, డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్, ఆర్కియాలజీ అధికారులతో పాటు మాజీ కార్పొరేటర్ తిరుమలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






