- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో అన్న.. రోకలి బండతో చంపిన చెల్లి
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోడపుట్టిన అన్ననే చెల్లి రోకలిబడతో కొట్టి చంపిన ఘటన జిల్లాలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. తాను ఇంటికి రాగానే చెల్లి కనిపించింది. దీంతో మద్యం మత్తులో వావివరసలు మరిచిపోయి చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తోడపుట్టిన అన్ననే చెల్లి రోకలిబడతో కొట్టి చంపిన ఘటన జిల్లాలోని విద్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫుల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. తాను ఇంటికి రాగానే చెల్లి కనిపించింది. దీంతో మద్యం మత్తులో వావివరసలు మరిచిపోయి చెల్లితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే తనను తాను కాపాడుకునేందుకు దగ్గరిలో ఉన్న రోకలిబండను అన్న మీదకు విసిరేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మద్యానికి బానిసైన అన్న తనను రోజు వేధించడం వలనే తాను ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులకు తెలిపింది. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






