అదిగో ఆ కనిపించే ఎయిర్ పోర్ట్ నాదేనంటూ స్కామ్ ఎలా చేశాడో చూడండి

by  |
అదిగో ఆ కనిపించే ఎయిర్ పోర్ట్ నాదేనంటూ స్కామ్ ఎలా చేశాడో చూడండి
X

దిశ,వెబ్‌డెస్క్: బ్యాంక్ దోపిడీ. అలాంటి ఇలాంటి దోపిడీ కాదు. ముఖానికి మాస్కులు లేవు. పక్కా ప్లాన్లులేవు. గన్నులు లేవు. బెదిరింపులు లేవు. అంతాపక్కా కార్పొరేట్ లెవల్లో జరిపిన దోపిడీ అది. ఒక్క లెటర్ తో వందల కోట్లను దోచేశాడు. ఒక్క లెటర్ తో నేషనల్ బ్యాంక్ ను నిండా ముంచేశాడు.ఇంతకీ ఆ ఘరానా దొంగెవరూ? దోపిడీ కథేంటీ ? అని అనుకుంటున్నారా ?

అలా దోచేస్తే పది ఇరవై లక్షలే. కానీ ఇలా దోచేస్తే ఒక్క దెబ్బకు వందల కోట్లే. ఒక్కలెటర్ తో వందల కోట్లు దోచేశాడు. ఆ సొమ్ముతో జల్సాలు చేశాడు. మాల్యాను మించిన ఘనుడు ఆయనే ఇమ్మాన్యుయేల్ న్యుడే. నైజీరియా దేశంలో 1995 మరియు 1998 మధ్య జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఇమ్మాన్యుయేల్ చేసిందే అతిపెద్ద స్కామ్. ఒక్క లెటర్ తో నకిలీ విమానాశ్రయాన్ని బ్రెజిలియన్ బ్యాంక్ కు అమ్మేశాడు. వందల కోట్లు కొల్లగొట్టాడు. గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా డైరెక్టర్ గా పనిచేసిన ఇమ్మాన్యుయేల్.., కుంభకోణం తర్వాత బాగా ఫేమస్ అయ్యాడు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా డైరెక్టర్ గా పనిచేసిన ఇమ్మాన్యుయేల్ న్యుడేకి బ్యాంకింగ్ రంగంలోని లూపోల్స్ ను అస్త్రంగా మార్చుకున్నాడు. ఆ అనుభవంతో కుంభకోణం చేస్తాడని నమ్మినవాళ్లు చేతులు కలిపారు. అనంతరం కుంభకోణం కోసం నాటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా గవర్నర్ ‘పాల్ ఒగ్వుమా’లా ఇమ్మాన్యుయేల్న టించాడు. అందుకు అతని సహచరులు ఇమ్మాన్యుయేల్ ఒఫోలు, ఓబుమ్ ఒసాక్వే, నెజెరిబె ఒకోలి మరియు భార్యాభర్తలిద్దరూ ఇకే,చుక్వులు అండగా నిలిచారు.

మారు వేషంలో

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా గవర్నర్ గ్వుమాలా మారువేషంలో ఉన్న ఇమ్మాన్యుయేల్ అప్పటి బ్రెజిలియన్ బ్యాంక్ డైరెక్టర్ నెల్సన్ తో కనెక్ట్ అవ్వగలిగాడు. తాము నైజీరియా రాజధాని అబుజాలో కొత్త ఎయిర్ పోర్ట్ ను నిర్మిస్తున్నామని, ఆ నిర్మాణానికి మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా నైజీరియా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుందని, అందుకు బ్రెజిలియన్ బ్యాంకు మద్దతు కోరాడు. అంతేకాదు ఈ ఒప్పొందం ప్రకారం 10 మిలియన్లను కమీషన్ఇ స్తానని బ్రెజిలియన్ బ్యాంక్ డైరెక్టర్ నెల్సన్ కు ఆశచూపాడు. దీంతో కమీషన్ కు కక్కుర్తిపడ్డ నెల్సన్ భారీ ఎత్తున చెల్లించేందుకు అంగీకరించాడు. అలా 1995 మరియు 1998 మధ్య నెల్సన్.., మోసగాళ్లకు 191 మిలియన్ డాలర్లను అప్పుగా ఇచ్చాడు. దీంతో నెల్సన్ కు మోసగాళ్లైన ఇమ్మాన్యుయేల్ 51 మిలియన్ డాలర్లను వడ్డీ రూపంలో చెల్లించాడు.

ఇక్కడ కథ వేరేలా ఉంది

అయితే, 1997 ఆగస్ట్లో స్పానిష్ బ్యాంక్ ‘బాంకో శాంటాండర్’ బ్రెజిలియన్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బ్రెజిల్ బ్యాంక్ ఆర్ధిక లావాదేవీలను పరిశీలించగా ఇమ్మాన్యుయేల్ చేసిన కుంభకోణం బయటపడింది. ఇదే సమయంలో రెండు బ్యాంక్‌ల మధ్య అనేక సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా అదే ఏడాది డిసెంబర్ నెలల్లో బ్రెజిల్ బ్యాంక్ అధికారులు.., నైజీరియన్ దేశంతో చేసిన అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్‌పై స్పానిష్ బ్యాంక్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. లావాదేవీల్లో జరిగిన నైజీరియా ఎయిర్ పోర్ట్ నిర్మాణాలపై ఆరా తీశారు. కానీ అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదని తేలడంతో ఇమ్మాన్యుయేల్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో బ్రెజిల్, నైజీరియా, స్విట్జర్లాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాలకు చెందిన ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు. బ్రెజిలియన్ బ్యాంక్ ను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చివరి దశలో ఉండగా బ్యాంక్ యజమానులు 242 మిలియన్ డాలర్లను చెల్లించింది . చివరికి బ్రెజిలియన్ బ్యాంక్ కుప్పకూలింది.

నిందితులు ఎలా పట్టుబడ్డారు

ఈ కుంభకోణం 1995 మరియు 1998 మధ్య జరిగినప్పటికీ, ఇమ్మాన్యుయేల్ మరియు అతని సహచరులు 2004 లో నైజీరియా అబుజా కోర్టుకు హాజరయ్యారు. 2002లో నైజీరియా అధ్యక్షుడు ఒలేసెగన్ ఒబాసాంజో ఆర్ధిక నేరాల్ని అరికట్టేలా ‘ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ కమిషన్’ (ఈఎఫ్‌సీసీ) సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధారంగా నిందితుల్ని 2004లో కోర్ట్‌ మెట్లెక్కించారు. విచారణ సందర్భంగా నిందితుడు ఇమ్మాన్యుయేల్ అతని సహచరులు 100కు పైగా మోసాలు చేసినట్లు తేలింది. తొలిసారి నేరాల్ని అంగీకరించకపోయినా, చివరికి నిందితులు దారికొచ్చారు. అంతేకాదు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఇమ్మాన్యుయేల్ ఈఎఫ్సీసీ అధికారులకు 75వేల డాలర్లు లంచం ఇచ్చేందుకు సంప్రదింపులు జరపడంతో, అధికారులు నిందితుడు ఇమ్మాన్యుయేల్పై అదనంగా కేసులు నమోదు చేశారు. 5ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం 5ఏళ్ల శిక్షను పూర్తి చేసుకున్న నిందితుడు ఇమ్మాన్యుయేల్ జైలునుంచి విడుదలై దర్జగా తిరిగేస్తున్నాడు.


Next Story

Most Viewed