- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు యువతుల ప్రేమాయణం.. హిజ్రాగా మారి మరీ..
<p>దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో ఎక్కడో ఒకచోట రోజు వింత సంఘటనలు గురించి వార్తలు వింటునే ఉంటాం. అలాంటి ఘటనే ఇది. ఓ యువతిని హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన ఓ యువతికి తన తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకంలో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే మరో మహిళతో పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్త స్నేహానికి దారితీసి ఒకరిపైఒకరికి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో ఎక్కడో ఒకచోట రోజు వింత సంఘటనలు గురించి వార్తలు వింటునే ఉంటాం. అలాంటి ఘటనే ఇది. ఓ యువతిని హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని మోసం చేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన ఓ యువతికి తన తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకంలో ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే మరో మహిళతో పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్త స్నేహానికి దారితీసి ఒకరిపైఒకరికి ఇష్టం ఏర్పడింది.
ఈ క్రమంలో సదరు యువతిలో పురుష లక్షణాలు ఉండడంతో హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని మహిళ చెప్పింది. ఈ మహిళ మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలం ఇద్దరు కలిసి జీవించారు. కొన్ని రోజుల నుండి మహిళ హిజ్రాగా మారిన యువతిని దూరంగా పెట్టి, ముఖం చాటేస్తూ పెళ్లికి నిరాకరించింది. దీంతో హిజ్రాగా మారిన యువతి తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఎలా దర్యాప్తు చేయాలోనని అయోమయంలో ఉన్నారు.






