అయ్యప్ప ఆలయంలో అద్భుత దృశ్యం.. ఏం జరిగిందంటే

by Chintha Aamani |

<p>దిశ,నిర్మల్ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయమైన సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సోమవారం తెల్లవారుజామున తొలి లేలేత సూర్యకిరణాలు స్వామివారి పాదాలను ముద్దాడాయి. దీంతో ఆలయంలో స్వామి విగ్రహం పసిడి వర్ణ శోభితమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా ఇదే సమయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమవడం ఆనవాయితీగా [&hellip;]</p>

ayyappa-swamy
X

దిశ,నిర్మల్ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయమైన సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సోమవారం తెల్లవారుజామున తొలి లేలేత సూర్యకిరణాలు స్వామివారి పాదాలను ముద్దాడాయి. దీంతో ఆలయంలో స్వామి విగ్రహం పసిడి వర్ణ శోభితమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా ఇదే సమయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమవడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ గురుస్వామి నర్సారెడ్డి తెలిపారు.

Next Story