ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..

by  |
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ..
X

దిశ, వెబ్‌డెస్క్ : రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. కరోన తరువాత కొన్ని రైళ్లను పునరిద్ధరించినా వాటిని ఇన్నాళ్లు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అని ప్రత్యేక ట్యాగ్‌ను వేసి నడిపింది. వాటిలో చార్జీలు కూడా అధికంగా వసూలు చేసింది. సుదూర ప్రాంతాలకు మాత్రమే రైళ్లను నడిపింది. తక్కువ దూరం ప్రయాణాలను నిలిపివేసింది. తరువాత తక్కువ దూర ప్రయాణీకులకు కొంచెం ఎక్కువ ఛార్జీలతో ప్రత్యేక రైళ్లు నడిపింది.

అయితే కరోన తగ్గుముఖం పట్టడంతో మళ్లీ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకున్న ‘ప్రత్యేక’ అనే పేరును తీసివేసి సాధారణంగా నడపాలని, అలాగే ఛార్జీలు కూడా తిరిగి మార్చాలని రైల్వే శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జోనల్ రైల్వేలకు రాసిన లేఖలో రైళ్లు ఇప్పుడు వాటి సాధారణ నంబర్లతో నడపబడతాయని, ఛార్జీలు సాధారణ ధరలకు తిరిగి వస్తాయని తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లో 1,700 కంటే ఎక్కువ రైళ్లు పునరుద్ధరించబడతాయని పేర్కొన్నది. ప్రత్యేక రైళ్ల నిర్వహణ, రాయితీలు లేకపోవడంతో, రైల్వే ఆదాయం గణనీయమైన వృద్ధిని సాధించింది. ట్రాన్స్‌పోర్టర్ ఆదాయంలో 113 శాతం పెరుగుదల నమోదైంది. కాని ప్రత్యేక రైళ్లలో నిలిపివేసినా రాయితీలను పునరుద్ధరిస్తారో లేదో కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనివ్వలేదు.


Next Story

Most Viewed