మేడారం అంతా జనమే.. జంపన్నవాగులో వేలాది మంది స్నానాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-30 06:43:59  IST  )

మేడారంలో జనం జాతర కొనసాగుతుంది. జాతర మొదలై మూడు రోజులు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు.

మేడారం అంతా జనమే.. జంపన్నవాగులో వేలాది మంది స్నానాలు
X

దిశ మేడారం నెట్వర్క్: మేడారంలో జనం జాతర కొనసాగుతుంది. జాతర మొదలై మూడు రోజులు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు జనమంతా కిక్కిరిసిపోయారు. గద్దెల నుంచి ఆర్టీసీ బస్ స్టాప్ వరకు ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తుంది. మేడారం గద్దెలకు గురువారం రాత్రి సమ్మక్క చేరుకోవడంతో వనదేవతల జాతర కొనసాగుతుంది.

రాత్రి నుంచే భారీగా ట్రాఫిక్ మేడారం మొదలుకాగా జంపన్నవాగు పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వాగువెంట శివసత్తుల పూనకాలతో హోరెత్తుతుంది. మేడారంలో ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తుంది. భారీగా రద్దీ పెరగడంతో దర్శనానికి గంటలతరబడి సమయం పడుతుంది. కొత్తగా నిర్మించిన క్యూ లైన్ కాంప్లెక్స్ నిండిపోవడంతో జనం రోడ్డుపైన కిలోమీటరు వరకు క్యూ లైన్ లో ఉన్నారు. భారీగా జనం రావడంతో అధికారులు కూడా భారీ ఏర్పాట్లను చేశారు. వనం జాతర ఆదివాసి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాది జనం రావడంతో మేడారం అంతా జన సమ్మోహమైంది.

Next Story