- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలానా తప్పించుకునేందుకు.. రోడ్డుపై మహిళ చేసిన పనికి పోలీసులు షాక్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే, మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. సదరు మహిళకు పోలీసులు జరిమానా విధిస్తుండగా ఆమె.. పోలీసులను గందరగోళానికి గురిచేసింది. చలానాను తప్పించుకోవడానికి పోలీసుల ముందు పూనకం వచ్చినట్టు నటిస్తూ వింతగా ప్రవర్తించింది. ఒక్కసారిగా పూనకం వచ్చిన వారిలా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడి కోసం తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు, వైద్యులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారికి పోలీసులు జరిమానాలు కూడా విధించారు. అయితే, మాస్కు ధరించకుండా రోడ్డు మీదకు వచ్చిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు.
సదరు మహిళకు పోలీసులు జరిమానా విధిస్తుండగా ఆమె.. పోలీసులను గందరగోళానికి గురిచేసింది. చలానాను తప్పించుకోవడానికి పోలీసుల ముందు పూనకం వచ్చినట్టు నటిస్తూ వింతగా ప్రవర్తించింది. ఒక్కసారిగా పూనకం వచ్చిన వారిలా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. తనను అమ్మవారు పూనిందని.. ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా పోలీసులను భయపెట్టడానికి ప్రయత్నించింది. ఆమె వింత ప్రవర్తనను చూసి.. అనంతరం పోలీసులు మహిళను వదిలేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీ పట్టణంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






