హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి

by  |

దిశ, మెదక్: వ్యక్తిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సాపూర్ సీఐ నాగయ్య, ఎస్ఐ సత్యనారాయణల వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి చెందిన చెరకు శివ(25) చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఓ మహిళతో రెండేళ్లుగా సహ జీవనం చేస్తున్నాడు. ఆమెకు ఇదివరకే వివాహం కాగా భర్త వదిలేశాడు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆమె తన ఇంట్లో చెరకు శివ ఆత్మహత్య చేసుకున్నాడంటూ 108కు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన 108 సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉండటంతో సోమవారం లోతుగా విచారణ చేయగా హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించారని గుర్తించారు.

Tags : person, died, suspicion, murder, medak, narsapur


Next Story

Most Viewed