రిజర్వాయర్‌లో వ్యక్తి గల్లంతు.. రంగంలోకి దిగిన పోలీసులు..

by Batti.Sumithra |

<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ (దేవాదుల) రిజర్వాయర్‌లో దేవరుప్పుల మండలం దేవుని తండాకు చెందిన ధరావత్ నరేష్ (33) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని కోసం బంధువుతో కలిసి స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి వచ్చిన నరేష్, మండలంలోని తలకాయలు గుట్ట సమీపంలో రిజర్వాయర్ నీటి లోకి దిగినట్లు తెలుస్తోంది. రిజర్వాయర్ గట్టుపైన అతడు ధరించిన దుస్తులు ఉండడంతో ఈత కోసం దిగాడా..? లేదా విద్యుత్ మోటార్ల మరమ్మతు కోసం [&hellip;]</p>

రిజర్వాయర్‌లో వ్యక్తి గల్లంతు.. రంగంలోకి దిగిన పోలీసులు..
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ (దేవాదుల) రిజర్వాయర్‌లో దేవరుప్పుల మండలం దేవుని తండాకు చెందిన ధరావత్ నరేష్ (33) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని కోసం బంధువుతో కలిసి స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి వచ్చిన నరేష్, మండలంలోని తలకాయలు గుట్ట సమీపంలో రిజర్వాయర్ నీటి లోకి దిగినట్లు తెలుస్తోంది.

రిజర్వాయర్ గట్టుపైన అతడు ధరించిన దుస్తులు ఉండడంతో ఈత కోసం దిగాడా..? లేదా విద్యుత్ మోటార్ల మరమ్మతు కోసం దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి ఉంటాడా..? అని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రిజర్వాయర్‌లో గల్లంతైన ధరావత్ నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇందుకోసం వరంగల్ జిల్లా కేంద్రం నుంచి గజ ఈతగాళ్లను తెప్పిస్తున్నట్లు స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐ లు రమేష్, శ్రీనివాస్ తెలిపారు.

Next Story