- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనవరాలి వయస్సున్న యువతితో వృద్ధుడు జంప్
<p>గుజరాత్: ఈ ఆధునిక ప్రపంచంలో కొందురు వ్యక్తుల వ్యవహార శైలి దారుణంగా ఉంటోంది. వారి కామకోరికలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కనీస విలువలను పాటించడంలేదు. అంతేకాదు.. కాపాడాల్సి చేతులే కాటేస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఓ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన మనవరాలి వయస్సున్న 19 ఏళ్ల యువతితో ఓ వృద్ధుడు జంపయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జూన్ 2వ తేదీన 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమె ఆచూకీ […]</p>

గుజరాత్: ఈ ఆధునిక ప్రపంచంలో కొందురు వ్యక్తుల వ్యవహార శైలి దారుణంగా ఉంటోంది. వారి కామకోరికలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కనీస విలువలను పాటించడంలేదు. అంతేకాదు.. కాపాడాల్సి చేతులే కాటేస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఓ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తన మనవరాలి వయస్సున్న 19 ఏళ్ల యువతితో ఓ వృద్ధుడు జంపయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జూన్ 2వ తేదీన 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. ఎంతకు దొరకలేదు. తమ కూతురు కనబడటంలేదని, అదేవిధంగా పొరుగింటి వృద్ధుడు షోవంజీ ఠాకూర్ కూడా కనిపించడంలేదని, అతడే మా అమ్మాయిని తీసుకెళ్లాడని వాళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేయలేదు. యువతి మేజర్ కావడంతో కేసు నమోదు చేయలేమని తేల్చిచెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు జూన్ 13న హైకోర్టును ఆశ్రయించారు. తమ కూతురును వృద్ధుడు ఎత్తుకెళ్లాడని, పోలీసులు కేసు నమోదు చేయడంలేదని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ వృద్ధుడి పెద్ద కుమార్తెకు ఇద్దరు పిల్లలున్నారని.. అంతటి వయస్సున్న ఆయన తమ అమ్మాయితో లేచిపోవడం సరికాదని, ప్రస్తుతం తమ కూతురు డేంజర్ జోన్ లో ఉందని కూడా వారు పేర్కొన్నారు. జూన్ 22న పిటిషన్ ను విచారించిన కోర్టు.. 29 లోగా యువతి ఆచూకీ కనుగొని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవలే మళ్లీ ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో ఆ యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు కోర్టుకు వివరించారు. దీంతో జూలై 13లోగా ఆ యువతిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులును కోర్టు ఆదేశించింది.






