రాతికోట‌ మీద వేప పుల్ల కోసం పోతే ప్రాణం పోయింది

by Batti.Sumithra |

<p>దిశ‌, ఖిలావ‌రంగ‌ల్ : వేపపుల్ల విరుచుకుంటూ గోడ మీద నుంచి జారిప‌డి వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న మంగ‌ళవారం వ‌రంగ‌ల్ జిల్లా ఖిలావ‌రంగ‌ల్‌లోని రాతికోట వ‌ద్ద జ‌రిగింది. వ‌రంగ‌ల్ శివ‌న‌గ‌ర్‌కు చెందిన సోమ‌ప్ప(75) అగ్నిమాప‌క శాఖ‌లో ప‌నిచేసి రిటైర్డయ్యాడు. నిత్యం శివ‌న‌గ‌ర్ నుంచి వ్యాయామం, యోగ చేసుకునేందుకు రాతికోట‌కు వ‌స్తుంటాడు. మంగ‌ళ‌వారం కూడా వ్యాయామం పూర్తయ్యాక ప‌ళ్లు తోముకునేందుకు మ‌రో స్నేహితుడు స‌త్యనారాయ‌ణ‌తో క‌ల‌సి రాతికోట‌పైకి ఎక్కాడు. వేప పుల్ల విరుస్తుండ‌గా సోమ‌ప్ప జారిప‌డిబోతుండ‌గా&#8230; స‌త్యనారాయ‌ణ [&hellip;]</p>

రాతికోట‌ మీద వేప పుల్ల కోసం పోతే ప్రాణం పోయింది
X

దిశ‌, ఖిలావ‌రంగ‌ల్ : వేపపుల్ల విరుచుకుంటూ గోడ మీద నుంచి జారిప‌డి వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘ‌ట‌న మంగ‌ళవారం వ‌రంగ‌ల్ జిల్లా ఖిలావ‌రంగ‌ల్‌లోని రాతికోట వ‌ద్ద జ‌రిగింది. వ‌రంగ‌ల్ శివ‌న‌గ‌ర్‌కు చెందిన సోమ‌ప్ప(75) అగ్నిమాప‌క శాఖ‌లో ప‌నిచేసి రిటైర్డయ్యాడు. నిత్యం శివ‌న‌గ‌ర్ నుంచి వ్యాయామం, యోగ చేసుకునేందుకు రాతికోట‌కు వ‌స్తుంటాడు. మంగ‌ళ‌వారం కూడా వ్యాయామం పూర్తయ్యాక ప‌ళ్లు తోముకునేందుకు మ‌రో స్నేహితుడు స‌త్యనారాయ‌ణ‌తో క‌ల‌సి రాతికోట‌పైకి ఎక్కాడు. వేప పుల్ల విరుస్తుండ‌గా సోమ‌ప్ప జారిప‌డిబోతుండ‌గా… స‌త్యనారాయ‌ణ ప‌ట్టుకునేందుకు ప్రయ‌త్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కోట గోడ మీద నుంచి కింద ప‌డ‌టంతో సోమ‌ప్ప అక్కడిక‌క్కడే మృతి చెందాడు. స‌త్యనారాయ‌ణ‌కు తీవ్ర గాయాలు కాగా స‌మీపంలో ఆస్పత్రికి త‌ర‌లించారు.

Next Story