- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలుకెళ్లానని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..
<p>దిశ, నల్లగొండ: జైలులో మూడు నెలల శిక్ష అనుభవించి, విడుదలైన వారానికే ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఉబ్బని ఆనంద్ నల్లగొండ మండలం కతాల్ గూడలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ వన్ టౌన్ […]</p>

దిశ, నల్లగొండ: జైలులో మూడు నెలల శిక్ష అనుభవించి, విడుదలైన వారానికే ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ఉబ్బని ఆనంద్ నల్లగొండ మండలం కతాల్ గూడలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆనంద్‌పై కేసు నమోదు కాగా, మూడు నెలలు నల్లగొండ జిల్లా జైలులో శిక్ష అనుభవించి వారం రోజుల ముందే జైలునుంచి విడుదలయ్యాడు.
అనంతరం అతడి భార్య వెంకటమ్మ, కుమారుడితో కలిసి సిలార్ మియాగూడెంలో కూలిపనులకు వెళ్లారు. రెండు రోజుల ముందు ఆనంద్‌ను అక్కడే ఉంచి, కతాల్‌గూడకు వచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన నాటినుంచి ఆనందర్ మనస్తాపానికి గురవుతూ వస్తున్నాడు. గురువారం తెల్లవారు జామున కొత్తపల్లి దగ్గర ఎస్ఎల్బీసీ కాలువదగ్గరకు వెళ్లి ఓ చెట్టుకు ఆనంద్ (60) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
- Tags
- jail






