ఎడ్ల బండే ఇల్లైంది..

by  |
ఎడ్ల బండే ఇల్లైంది..
X

దిశ,బోథ్ : పంట వేసిన నాటి నుంచి అది చేతికి వచ్చే వరకు రైతు పడే కష్టాలు అంతా ఇంతా కాదు. ఇక పంట కోతకు వచ్చే సమయంలో రైతు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉంటాడు. ఓవైపు అడవి పందులు, అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. పంటను కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూనే, రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇలానే తన పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న రీతిలో ఆలోచించాడు. మండే ఎండలు ఆపై అడవి పందుల భయం, మరో వైపు పాముల భయం. చేనులోకి పోతే ఇన్ని భయాలు రైతులను వెంటాడుతుంటాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి కౌఠ గ్రామానికి చెందిన జనిగే గంగారం అనే రైతు తన చేనులోని ఎడ్ల బండిపైనే తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. పంట చేతికొచ్చే వరకు అక్కడే ఉంటూ కాపాల కాస్తున్నాడు. గంగారం ఐడియాను చూసి గ్రామస్తులు, తోటి రైతులు సైతం మెచ్చుకుంటున్నారు.



Next Story

Most Viewed