గుడ్‌న్యూస్.. రక్తహీనతకు సరికొత్త పరిష్కారం

by  |
గుడ్‌న్యూస్.. రక్తహీనతకు సరికొత్త పరిష్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రక్తహీనతతో బాధపడే పిల్లలు, మహిళలకు పోషక పదార్థాలు, విటమిన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశనంలో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణ బియ్యంతో పాటు విటమిన్లు, మినరల్స్ అందించేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని చేపట్టేందుకు కేంద్రం సిఫారసు చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాను మార్చి 12న పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పోషక విలువలను కలిగిన బియ్యాన్ని అందజేసి రక్తహీనత సమస్యను తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పోషకాలతో కూడిన బియ్యాన్ని అందించేందుకు కేంద్రం సూచనల మేరకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా, కన్వీనర్ సభ్యులుగా సివిల్ సప్లయ్ కమిషనర్ వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ఫైనాన్స్, స్కూల్ ఎడ్యూకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ సెక్రటరీలు, ఎఫ్ సీఐ జీఎం, టీఎస్సీఎస్సీఎల్ ఎండీ, ఛైల్డ్ వెల్పేర్ ప్రత్యేక కార్యదర్శి ఉంటారు. రాష్ట్రంలో రక్తహీనతను ఎదుర్కుంటున్న వారందరికీ పోషక విలువలతో కూడిన బియ్యాన్ని అందించడంలో లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.



Next Story