- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్యుల నిర్లక్ష్యం.. మూడేండ్ల చిన్నారి మృతి
<p>దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేండ్ల చిన్నారి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి బలి అయ్యింది. వివరాళ్లోకి వెళితే.. అన్పుర్ గ్రామానికి చెందిన సాబన్న చంద్రకళ దంపతుల కూతురు భూమిక(3) డయేరియాతో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం చేరింది. పాపకు ఏ ప్రాబ్లం లేదని.. ఏదైనా ఉంటే మేము చెక్ చేసి, బాగుచేస్తాం అని వైద్యులు అన్నారు. బుధవారం ఉదయం తెల్లవారు జామున 5 గంటలకు పాపకు సీరియస్‌గా […]</p>

దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేండ్ల చిన్నారి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి బలి అయ్యింది. వివరాళ్లోకి వెళితే.. అన్పుర్ గ్రామానికి చెందిన సాబన్న చంద్రకళ దంపతుల కూతురు భూమిక(3) డయేరియాతో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మంగళవారం చేరింది. పాపకు ఏ ప్రాబ్లం లేదని.. ఏదైనా ఉంటే మేము చెక్ చేసి, బాగుచేస్తాం అని వైద్యులు అన్నారు. బుధవారం ఉదయం తెల్లవారు జామున 5 గంటలకు పాపకు సీరియస్‌గా ఉంది అని, వెంటిలేటర్ అవసరం అని హైదరాబాద్‌కు తరలించాలని తెలిపారు. అప్పటికే పాపలో ఎలాంటి చలనం లేకపోవటంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగి డాక్టర్‌ను అడగ్గా త్వరగా తీసుకెళ్లండి అని మాత్రమే సమాధానం ఇచ్చిన్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. హైదరాబాద్‌కు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో అప్పటికే మృతిచెందిందని గమనించిన తలిదండ్రులు వెనక్కివచ్చారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే, వైద్యం వికటించి తమ చిన్నారి మృతిచెందిందని రోధిస్తూ.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు.






