లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: న్యాయమూర్తి నీలిమ

by Shyam |   (  Updated:2021-11-27 02:50:22  IST  )

<p>దిశ, సిద్దిపేట: జాతీయ లోక్ అదాలత్ ను డిసెంబర్ 11న సిద్దిపేటలోని కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్ట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలం, డబ్బు కన్నా చాలా విలువైనదని చిన్న చిన్న తగాదాలతో డబ్బులు, [&hellip;]</p>

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: న్యాయమూర్తి నీలిమ
X

దిశ, సిద్దిపేట: జాతీయ లోక్ అదాలత్ ను డిసెంబర్ 11న సిద్దిపేటలోని కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ తెలిపారు. జిల్లా కోర్ట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలం, డబ్బు కన్నా చాలా విలువైనదని చిన్న చిన్న తగాదాలతో డబ్బులు, సమయం వృధా చేసుకోవద్దని, ఈ ఏడాది లో జరిగే చివరి లోక్ అదాలత్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Next Story