- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
<p>దిశ, వెబ్ డెస్క్ : ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.బెయిల్ తో పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు అనుమతివ్వాలని ఎంపీ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.బెయిల్ తో పాటు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలకు అనుమతివ్వాలని ఎంపీ తరుపున న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం నేటి మధ్యహ్నం 12 గంటలకు ఈ కేసును విచారించనుంది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య పరీక్షల నివేదికను తమకు అందించాలని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సికింద్రబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి కాగా, సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి వైద్యపరీక్షల నివేదిక అందించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది.
Next Story






