వివాహేతర సంబంధం.. కన్న బిడ్డల్ని అలా చేసిన తల్లి

282
murde

దిశ, వెబ్‌‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో  మానవత్వం మంటకలిసి పోతోంది. వావి వరసలు మరిచి రక్త సంబంధాలను కడ తేర్చుతున్నారు. క్షణికమైన సుఖాలకు ముక్కుపచ్చలారని పిల్లలను కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని సొంత పిల్లలనే చంపేస్తున్నారు. ఈ విధంగానే తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కోసం కన్నతల్లే నవమాసాలు మోసి కని పెంచిన తన కన్న బిడ్డలను అతి దారుణంగా చంపేసింది.

వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని రాజమండ్రి ఆనంద్ నగర్‌లో పూరేటి లక్ష్మీ అనూష (28) తన కుమార్తె చిన్మయి(8), కుమారుడు మోహిత్ (6)లతో కలిసి నివాసముంటోంది. 13 ఏళ్ల క్రితం తాడేపల్లిలో భర్త చనిపోవడంతో లక్ష్మీ అనూష రాజమండ్రికి వచ్చింది. బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. కొన్ని రోజుల నుంచి వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె చిన్మయి, కుమారుడు మోహిత్‌లను లక్ష్మీ అనూష గత రాత్రి ఇంట్లో ఉరివేసి హత్య చేశారు. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనూషపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.