- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనికరంలేని తల్లి.. చెట్లపొదల్లో చిన్నారి
<p>దిశ, ముథోల్ : ఏ తల్లి కన్న బిడ్డనో తెలియదు కానీ అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు చెట్లపొదల్లో దర్శనమిచ్చింది. ఆడపిల్ల భారం అనుకుందో మరేదైన కారణం ఉందో కానీ.. అప్పుడే పుట్టిన చిన్నారిని చెట్ల పొదల్లో పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళకు చిన్న పిల్ల ఏడుపు వినపపడడంతో దగ్గరకి వెళ్లింది. […]</p>

X
దిశ, ముథోల్ : ఏ తల్లి కన్న బిడ్డనో తెలియదు కానీ అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు చెట్లపొదల్లో దర్శనమిచ్చింది. ఆడపిల్ల భారం అనుకుందో మరేదైన కారణం ఉందో కానీ.. అప్పుడే పుట్టిన చిన్నారిని చెట్ల పొదల్లో పడేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళకు చిన్న పిల్ల ఏడుపు వినపపడడంతో దగ్గరకి వెళ్లింది. మహిళ అక్కడ చూసేసరికి ఓ ఆడ పసికందు చెట్లపొదల్లో పడి ఉంది. దీంతో వెంటనే ఆ మహిళ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






