దయచేసి నన్ను కాపాడండి.. నా కొడుకు చంపడానికి చూస్తున్నాడు

by Shyam |   (  Updated:2021-10-25 03:21:33  IST  )

<p>దిశ, సిద్దిపేట: ‘‘నా పేరు బొల్లం కనుకమ్మ(65). నా భర్తపేరు ధర్మపురి(73). సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు గణేష్, చిన్న కొడుకు సుదర్శన్. మాకు 50 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఉన్నతస్థితికి తీసుకొచ్చాం. పూర్వీకుల ఆస్తులను కాపాడుకుంటూనే.. సొంతంగా అనేక వ్యాపారాలు చేసి వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కొడుకుల కోసం సంపాదించాం. ఇప్పటికే కొన్ని ఆస్తులు కొడుకుల పేరున [&hellip;]</p>

mother complaint
X

దిశ, సిద్దిపేట: ‘‘నా పేరు బొల్లం కనుకమ్మ(65). నా భర్తపేరు ధర్మపురి(73). సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు గణేష్, చిన్న కొడుకు సుదర్శన్. మాకు 50 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఉన్నతస్థితికి తీసుకొచ్చాం. పూర్వీకుల ఆస్తులను కాపాడుకుంటూనే.. సొంతంగా అనేక వ్యాపారాలు చేసి వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు కొడుకుల కోసం సంపాదించాం. ఇప్పటికే కొన్ని ఆస్తులు కొడుకుల పేరున నమోదు కూడా చేశాం. వృద్దాప్యంలో మేము మా వ్యాపారాలను నిర్వహించలేకపోతున్నాం. ఇప్పటికీ కొడుకులతో కలిసే నివసిస్తున్నాం.

వ్యాపార, వ్యవసాయ లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అన్ని ఉమ్మడిగానే నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఉమ్మడిగా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసిన భూములు, ఆస్తులు, ప్లాట్లు, వ్యాపార లావాదేవీలు తనకే దక్కాలని తన చిన్న కొడుకు సుదర్శన్ తమను మానసికంగా వేధిస్తున్నాడు. కని పెంచిన తల్లిదండ్రులు అని చూడకుండా దాడులకు తెగబడ్డాడు. ఈ విషయంపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాం. ఇప్పటికే ఒక కోటి 20 లక్షలను చిన్న కొడుకు సుదర్శన్‌కు ఇచ్చాం. అప్పటికీ సంతృప్తి చెందకుండా ఉమ్మడి ఆస్తులను కాజేయాలని చూస్తున్నాడు. తనను సహకరించపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

వృద్ధులైన మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రస్తుతం పెద్ద కుమారుడు గణేష్ సంరక్షణలో ఉన్నాం. మా సంరక్షణ, బాగోగులు చూడకుండా దాడులు చేస్తూ వృద్దాప్యంలో మానసిక క్షోభకు గురిచేస్తున్న చిన్న కొడుకు సుదర్శన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.’’ ఈ మేరకు సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌కు చెందిన బొల్లం కనుకమ్మ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిని కలిసి వేడుకుంది. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ చిన్న కొడుకు సుదర్శన్‌కు నోటీసులు జారీ చేయాలని సిద్దిపేట ఆర్డీఓ అనంత రెడ్డిని ఆదేశించారు. చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అంతేగాకుండా.. వృద్దాప్యంలో తల్లిదండ్రుల భద్రత, సంరక్షణతో పాటు వారి పట్ల గౌరవంగా మసులుకోవాల్సిన బాధ్యత వారి కుటుంబాల్లోని పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి సూచించారు.

Next Story