- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లీకొడుకులను బలిగొన్న వాటర్ హీటర్
<p>దిశ, ఏపీ బ్యూరో: స్నానం చేసేందుకు నీళ్లు వేడి చేసుకునే హీటర్ షాక్ కొట్టి తల్లీ, ఇద్దరు కొడుకులు మృతిచెందారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యంలో శనివారం చోటు చేసుకుంది. గుల్యం గ్రామానికి చెందిన సవిత(35) వేడి నీటి కోసం హీటర్‌ను ప్లాస్టిక్ బకెట్‌లో పెట్టింది. నీరు వేడి అయ్యాయో లేదో తెలుసుకోవడానికి స్విచ్ ఆఫ్ చేయకుండానే నీటితో చేయి పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. తల్లి అరుపులు విన్న […]</p>

దిశ, ఏపీ బ్యూరో: స్నానం చేసేందుకు నీళ్లు వేడి చేసుకునే హీటర్ షాక్ కొట్టి తల్లీ, ఇద్దరు కొడుకులు మృతిచెందారు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యంలో శనివారం చోటు చేసుకుంది. గుల్యం గ్రామానికి చెందిన సవిత(35) వేడి నీటి కోసం హీటర్‌ను ప్లాస్టిక్ బకెట్‌లో పెట్టింది. నీరు వేడి అయ్యాయో లేదో తెలుసుకోవడానికి స్విచ్ ఆఫ్ చేయకుండానే నీటితో చేయి పెట్టింది. దీంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. తల్లి అరుపులు విన్న ఇద్దరు కుమారులు వెంకటసాయి(8), నశ్చల్(11) ఇరువురు ఇంట్లోకి వచ్చి తల్లి పట్టుకున్నారు. అప్పటికే తల్లి చేయి బకెట్‌లో కరెంట్ షాక్‌తో ఉండటంతో ఇద్దరు కుమారులకూ షాక్ తగిలి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.






