- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో కొడుకు మరణం.. షాక్‌తో తల్లి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, రాజేంద్రనగర్ : ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు మరణించడంతో నానాజీపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీ పూర్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. మాణిక్యం గౌడ్(40) అనే వ్యక్తి కరోనా బారిన పడి గత రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందాడు. అయితే, కొడుకు మరణాన్ని తట్టుకోలేక మాణిక్యం గౌడ్ […]</p>

X
దిశ, రాజేంద్రనగర్ : ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు మరణించడంతో నానాజీపూర్ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీ పూర్ గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. మాణిక్యం గౌడ్(40) అనే వ్యక్తి కరోనా బారిన పడి గత రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందాడు. అయితే, కొడుకు మరణాన్ని తట్టుకోలేక మాణిక్యం గౌడ్ తల్లి జంగమ్మ(70) గుండెపోటుతో మరణించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు ఇద్దరు మృతి చెందడంతో నానాజీపూర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






