రానున్నది నోటిఫికేషన్.. మరి కానున్న ఎమ్మెల్సీలు ఎవరు ?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-05 00:30:41  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : మరో మూడ్రోజుల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఆ పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారు. అధినేత ఎక్కడ ఉన్నారో తెలియక ఆశావాహులు ప్రగతి భవన్, ఫౌం హౌజ్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఎవరికీ అవకాశం కల్పిస్తారో అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఖాళీగా [&hellip;]</p>

రానున్నది నోటిఫికేషన్.. మరి కానున్న ఎమ్మెల్సీలు ఎవరు ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మరో మూడ్రోజుల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఆ పదవుల కోసం టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను కలిసేందుకు క్యూ కడుతున్నారు. అధినేత ఎక్కడ ఉన్నారో తెలియక ఆశావాహులు ప్రగతి భవన్, ఫౌం హౌజ్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ ఎవరికీ అవకాశం కల్పిస్తారో అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది.

తెలంగాణ శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీల స్థానాలు అధికార పార్టీకి చెందినవే. అయితే తిరిగి ఆ పార్టీకే దక్కే అవకాశం ఉంది. 119 ఎమ్మెల్యే స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి103, మజ్లిస్‌ 7, కాంగ్రెస్‌ 6, బీజేపీకి 3 ఉన్నాయి. ప్రస్తుత బలం ప్రాతిపదికన టీఆర్ఎస్ కే మొత్తం ఆరు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండటంతో పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పెద్దఎత్తున పోటీ నెలకొంది. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. ప్రగతిభవన్, ఫౌం హౌజ్ ఇలా ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి కలుస్తున్నారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారికి సైతం వేదికల పైనే నామినేటెడ్, ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చారు. అయితే వారు కూడా నోటిఫికేషన్ మరో మూడ్రోజుల్లో వెలువడనుండటంతో పార్టీ అధినేత ఆశీర్వాదం కోసం పోటీపడుతున్నారు.

ఎమ్మెల్యే కోటా నుంచి పదవీకాలం ముగిసిన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి కి మరో అవకాశం ఇవ్వాలని అధినేతను ఇప్పటికే కోరగా సమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం. మహిళా కోటాలో ఆకుల లలిత, మున్నురు కాపు నేత నేతి విద్యాసాగర్‌ లు ఉండగా వీరిద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో ఒకరికే అవకాశం దక్కే చాన్స్ ఉందని పార్టీ నేతలు అంటున్నారు. మైనారిటీల కోటాలో ఫరీదుద్దీన్‌ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. అయితే జహీరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుండటంతో మరోసారి అవకాశం కల్పిస్తారా? లేదో చూడాలి. ఒక్కవేళ అతడికి ఇవ్వకుంటే అదే సామాజిక వర్గం నుంచి మరొకరికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని అధినేతను కోరినట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా పార్టీ అధిష్టానం సమీకరణాలపై చర్చిస్తోంది. ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత రాకుండా, సామాజిక వర్గాలు, కులాల నుంచి ఎలాంటి డ్యామేజ్ జరుగకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే అన్ని కులాల్లో బలమైన నేతలుగా ఉన్న వారి వివరాలను అధిష్టానం సేకరించింది. ఎవరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారో.. ఎవరికి మొండి చెయ్యి చూపుతారోనని పార్టీల్లో జోరుగా చర్చజరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ మరో మూడ్రోజుల్లో చర్చలకు, ఉత్కంఠకు తెరపడనుంది.

Next Story