- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం : మంత్రులు
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్‌పల్లి చెరువులో మంత్రులు చేప పిల్లలను వదిలారు. అనంతరం వారు మాట్లడుతూ… మత్స్యకారుల జీవనభృతి మెరుగుపడాలని, రాష్ట్రంలోని చెరువుల్లో చేపలను వదులుతున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 11 లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ముదిరాజులు, మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్‌పల్లి చెరువులో మంత్రులు చేప పిల్లలను వదిలారు. అనంతరం వారు మాట్లడుతూ…
మత్స్యకారుల జీవనభృతి మెరుగుపడాలని, రాష్ట్రంలోని చెరువుల్లో చేపలను వదులుతున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లాలో 11 లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ముదిరాజులు, మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






