తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

103

దిశ, వెబ్ డెస్క్ : రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, అక్కడక్కడ భారీ వర్షం పనడనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న మూడురోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లు పడనున్నాయి. అలానే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..