- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెల్లి పెళ్లికి వెళ్లిన భార్య.. భర్త ఆత్మహత్య
<p>దిశ, జవహర్ నగర్: మద్యానికి బానిసై అప్పుల బాధతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… బీ.జే.ఆర్ నగర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో యాదగిరి(32), భార్య సుమలత నివాసముంటున్నారు. గత కొంత కాలంగా మద్యానికి బానిసై అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న యాదగిరి పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించేవాడు. ఈ నెల 28న సుమలత […]</p>

దిశ, జవహర్ నగర్: మద్యానికి బానిసై అప్పుల బాధతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… బీ.జే.ఆర్ నగర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో యాదగిరి(32), భార్య సుమలత నివాసముంటున్నారు. గత కొంత కాలంగా మద్యానికి బానిసై అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న యాదగిరి పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించేవాడు. ఈ నెల 28న సుమలత తన చెల్లి పెళ్లి ఉందని వెళ్ళింది. దీంతో అదే అవకాశంగా తీసుకున్న యాదగిరి 29న తాను చనిపోతున్నానని సుమలతకు ఫోన్ చేశాడు. వెంటనే యుగంధర్ తల్లికి ఫోన్ చెయ్యగా ఉదయమే ఇంటి నుండి తన బైక్ మీద బయటకు వెళ్లాడని తెలిపింది. దీంతో బంధువులు, స్నేహితులతో కలిసి వెతకడంతో తిమ్మాయి పల్లి అడవుల్లో చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






