- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం..ముగ్గురు మత్స్యకారుల గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గార గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు శనివారం ఉదయం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గణేశ్ అనే యువకుడు మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గార గ్రామానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు శనివారం ఉదయం చేపలవేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ముగ్గురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన తోటి మత్స్యకారులు వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గణేశ్ అనే యువకుడు మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు గల్లంతయ్యారన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సముద్రం ఒడ్డుకు చేరుకుని బోరున విలపిస్తున్నారు. గణేష్ కుటుంబ సభ్యులు అతడి మృతదేహాన్ని చూసి విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది.
Next Story






