చేపల వేటకు వెళ్లి… అనంతలోకాలకు

by Sridhar Babu |   (  Updated:2020-08-27 11:29:41  IST  )

<p>దిశ, సిరిసిల్ల: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం&#8230; పట్టణంలోని సాయినగర్‌కు చెందిన తలారి రాయనర్సి(55) రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం ఎక్కడా పని దొరక్కపోవడంతో తన ఇంటికి సమీపంలో ఉన్న కార్గిల్ లేక్ చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న [&hellip;]</p>

చేపల వేటకు వెళ్లి… అనంతలోకాలకు
X

దిశ, సిరిసిల్ల: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… పట్టణంలోని సాయినగర్‌కు చెందిన తలారి రాయనర్సి(55) రోజువారి కూలీగా పనిచేస్తున్నాడు.

గురువారం ఎక్కడా పని దొరక్కపోవడంతో తన ఇంటికి సమీపంలో ఉన్న కార్గిల్ లేక్ చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ సతీశ్ రావు, ఫైర్ మాన్ వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Next Story