- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాక్టరీలో ప్రమాదం.. సేఫ్టీ కిట్స్ లేక పోవడంతో..
<p>దిశ, పరిగి: ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడికి సేఫ్టీ కిట్స్ లేనందున తలపై రాడ్ పడి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవి పల్లి సమీపంలోని సుగుణ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన హుసేన్ (38) కొంతకాలంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ క్రేన్ రాడ్ పడింది. తల వెనక భాగంలో తగలడంతో తల పగిలి అక్కడికక్కడే […]</p>

X
దిశ, పరిగి: ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడికి సేఫ్టీ కిట్స్ లేనందున తలపై రాడ్ పడి మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవి పల్లి సమీపంలోని సుగుణ మెటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన హుసేన్ (38) కొంతకాలంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మంగళవారం ఉదయం ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ క్రేన్ రాడ్ పడింది. తల వెనక భాగంలో తగలడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని తోటి కార్మికులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం అతని కుటుంబానికి ఆసరాగా నిలవాలని, మృతుడికి నష్ట పరిహారం అందించాలని వారు కోరారు. మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షల నిమిత్తం ఉంచారు.
Next Story






