- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
<p>దిశ, కోదాడ: కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… కోదాడ మండలం కొమరబండ గ్రామానికి చెందిన చింత వెంకన్న(50) కోదండరాంపురంలోని తన వ్యవసాయ భూమిలో పొలం నాటు వేయించేందుకు వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. […]</p>

X
దిశ, కోదాడ: కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… కోదాడ మండలం కొమరబండ గ్రామానికి చెందిన చింత వెంకన్న(50) కోదండరాంపురంలోని తన వ్యవసాయ భూమిలో పొలం నాటు వేయించేందుకు వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వెంకన్న కొమరబండ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






