నాగర్‌ కర్నూల్‌‌లో సైకో కలకలం.. సొంత అన్నపై హత్యాయత్నం

by  |
నాగర్‌ కర్నూల్‌‌లో సైకో కలకలం.. సొంత అన్నపై హత్యాయత్నం
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. సొంత అన్నను కత్తితో పొడిచి హత్య చేయడానికి యత్నించాడు తమ్ముడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ఎండీ ఆయాస్ ఖాన్, ఎండీ రియాజ్ ఖాన్‌లు అన్నదమ్ములు. గత కొంత కాలంగా ఇరువురి మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని.. ఇందులో భాగంగా శుక్రవారం అన్న ఆయాస్ ఖాన్ పై.. తమ్ముడు రియాజ్ కత్తితో మూడుసార్లు పొడిచాడు. దీంతో గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో తీవ్ర రక్త స్రావం కావడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 8 నెలల క్రితం అన్న కూతురిని కూడా చంపడానికి రియాజ్ ప్రయత్నం చేయగా కాలనీ వాసులు రక్షించారని.. రియాజ్ సైకోలాగా ప్రవర్తిస్తుంటాడని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మతిస్థిమితం లేకుంటే తగిన చికిత్స అందించాల్సిన బాధ్యత వారిపై ఉన్నదని.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు.



Next Story

Most Viewed