ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధాన ఆయుధం

by Shyam |

<p>దిశ, ముషీరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ఆయుధం ఓటు అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, మ్యాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యాలయంలో ఓటు విలువ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230;. విలువైన ఓటు హక్కు గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన [&hellip;]</p>

ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధాన ఆయుధం
X

దిశ, ముషీరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ఆయుధం ఓటు అని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, మ్యాగ్నిజెంట్ డిజిటల్ సొల్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యాలయంలో ఓటు విలువ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విలువైన ఓటు హక్కు గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓటు హక్కు పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా అమెరికాలో ఓటింగ్ విధానం ఉంటుందని తెలిపారు. పోలింగ్‌కు ముందు కూడా ఓటు వేసే అవకాశం అక్కడ ఉందన్నారు.

Next Story