- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంత ఘోరమా.. ప్రేమించిందని గ్రామం నడిబొడ్డున అలా చేసిన గ్రామస్తులు ..
<p>దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక మైనర్ బాలిక అతని తో వెళ్లిపోవడానికి సిద్దపడింది. అయితే తమ పరువు తీసిందని అమానవీయంగా ప్రవర్తించారు బంధువులు. పారిపోతున్న జంటను పట్టుకుని అమ్మాయికి గుండు కొట్టించారు. అంతే కాదు ముఖానికి నల్ల రంగు పూసి ఊరంగా ఊరేగించారు. గుజరాత్ లోని పటాన్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. అయితే పోలీసులు మాత్రం నిన్న వివరాలు బయట పెట్టారు. బాలికను మాతమే కాదని […]</p>

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఒక మైనర్ బాలిక అతని తో వెళ్లిపోవడానికి సిద్దపడింది. అయితే తమ పరువు తీసిందని అమానవీయంగా ప్రవర్తించారు బంధువులు. పారిపోతున్న జంటను పట్టుకుని అమ్మాయికి గుండు కొట్టించారు. అంతే కాదు ముఖానికి నల్ల రంగు పూసి ఊరంగా ఊరేగించారు. గుజరాత్ లోని పటాన్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. అయితే పోలీసులు మాత్రం నిన్న వివరాలు బయట పెట్టారు. బాలికను మాతమే కాదని ఆ యువకుడికి కూడా గుండు కొట్టించి గ్రామంలో ఊరేగించినట్టు విచారణ లో తేలిందని చెప్పారు.
తమ సామాజిక వర్గం పరువు తీసిందనే కోపంతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ 35 మంది పైన కేసులు నమోదు చేశామని, మరో 23 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇంతలో ఇంకో ట్విస్ట్ తెలిసింది. బాలిక తల్లిదండ్రులు తమ కూతురుపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని ప్రియుడి పై కేసు పెట్టారు. దాంతో ప్రియుడి మీద కూడా లైంగిక ఆరోపణల కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు వివరాలు వెల్లడించారు.






