బాతు పిల్లకు సాయం చేసిన సింహం.. వీడియో వైరల్

by  |
బాతు పిల్లకు సాయం చేసిన సింహం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సింహం.. అడివికి మహారాజు… క్రూరత్వానికి రారాజు. ఒక్కసారి సింహం గర్జిస్తే అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. ఇక దానికి ఆకలి వేస్తే చిన్న ప్రాణి , పెద్ద ప్రాణి ఏం తేడా లేకుండా లాగించేస్తుంది. సింహం గాంభీర్యం ముందు ఏ ఒక్కరు నిలబడలేరు.. ఇది మనకు తెలిసిన సింహం వ్యక్తిత్వం. కానీ నాణేనికి రెండు వైపులు ఉన్నట్టు సింహానికి కూడా మరో రూపం ఉంటుందని ఈ సింహం రుజువు చేసింది. ఇంత పెద్ద మాంసాహార జంతువుకు సైతం మంచి మనసు ఉంటుందని నిరూపించింది. తనకన్నా చిన్న ప్రాణి కష్టాల్లో ఉంటే సాయం అందించి మనుషులకు ఒక మంచి పాఠాన్ని నేర్పింది.

ఇంతకూ ఆ సింహం చేసిన పని ఏంటంటే.. ఒక బాతు పిల్ల చెరువులో ఈదేందుకు కష్టపడుతుంది. పడుతూ, లేస్తూ ఈతకొడుతున్న బాతు పిల్లను అటుగా వెళ్తున్న సింహం చూసింది. వెంటనే బాతుపిల్ల వద్దకు వచ్చి.. తన కాళ్లతో దాన్ని నీళ్ళలోకి నెట్టింది. అంతేకాకుండా బాతు పిల్ల తలా నిమురుతూ ధైర్యం చెప్తున్నట్లు ఆ వీడియో లో కనిపించింది. ఈ వీడియోను సుశాంత్ నందా అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్విట్టర్ లో షేర్ చేస్తూ నీలో ఉన్న మంచి మనసు ఎంతమందికి తెలుసు అంటూ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


Next Story