- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్కంఠ పోరులో ఫైనల్‌కి చేరిన ముంబయి సిటీ
<p>దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ఆటలో ఉండే అసలు సిసలు మజాను అభిమానులు మరోసారి అనుభవించారు. ఐఎస్ఎల్ 2020/21 సీజన్ సెకెండ్ లెగ్ తొలి సెమీస్‌లో ముంబయి సిటీ క్లబ్ అద్భుత విజయాన్ని సాధించింది. ముంబయి సిటీ, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఆటకు జోడించారు. ఆ సమయంలో కూడా ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. […]</p>

దిశ, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్ ఆటలో ఉండే అసలు సిసలు మజాను అభిమానులు మరోసారి అనుభవించారు. ఐఎస్ఎల్ 2020/21 సీజన్ సెకెండ్ లెగ్ తొలి సెమీస్‌లో ముంబయి సిటీ క్లబ్ అద్భుత విజయాన్ని సాధించింది. ముంబయి సిటీ, గోవా ఫుట్‌బాల్ క్లబ్ మధ్య జీఎంసీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 30 నిమిషాల అదనపు సమయాన్ని ఆటకు జోడించారు. ఆ సమయంలో కూడా ఇరు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటౌట్ ద్వారా తేల్చాలని రిఫరీ నిర్ణయించాడు. అయితే ఐదు పెనాల్టీల తర్వాత కూడా స్కోర్ 2-2తో డ్రాగా ముగిసింది. దీంతో రిఫరీ మరో 5 పెనాల్టీ షూటౌట్లకు ఆటను పెంచారు. ఆ సమయంలో ముంబయి జట్టు ఒక గోల్ అదనంగా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్‌లో ముంబయి 6-5 తేడాతో విజయం సాధించింది. దీంతో లీగ్ విన్నర్ అయిన ముంబయి సిటీ ఐఎస్ఎల్ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు సావియర్ గామ, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవాన్ గొన్జాల్వెస్‌కు లభించాయి.






