స్నాక్స్ తింటూ ల్యాప్ టాప్ ఆపరేట్ చేస్తోన్న ఉడత!

by  |
స్నాక్స్ తింటూ ల్యాప్ టాప్ ఆపరేట్ చేస్తోన్న ఉడత!
X

దిశ, వెబ్ డెస్క్: అవును.. మీరు చదివింది నిజమే. మీకు కనిపిస్తున్న ఈ ఫొటోలో ఉడత ల్యాప్ టాప్ ను ఆపరేట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోన్నది కదా..! విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఈ దృశ్యం కనిపిస్తోన్నది. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న విషయం విధితమే. అయితే ఓ వ్యక్తి కూడా తనకు అనువైన స్థలం నుంచి ల్యాప్ టాప్ ద్వారా వర్క్ చేస్తూ కాసేపు సేదా తీరాడు. అయితే ఈ సమయంలో ఓ ఉడత అక్కడున్న స్నాక్స్ తినేందుకని అక్కడికి వచ్చింది. అనంతరం ఆ టేబుల్ పై ఉన్న ల్యాప్ టాప్ చూసి దానిని ఓపెన్ చేసింది. పక్కనే ఉన్న స్నాక్స్ తీసుకొని తింటూ ల్యాప్ టాప్ చూస్తూ కీ బోర్డ్ ను టచ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది. ఇది చూసిన నెటిజన్లు బాగుందంటూ తెగ నవ్వుకుంటున్నారు.

Next Story

Most Viewed