- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా ముత్తాతలు ఇచ్చిన భూమి మాదే.. రహదారి విషయంలో దాడి…
<p>దిశ, పాలేరు: కూసుమంచి మండలంలోని కేశవాపురం గ్రామంలో మంగళవారం రాత్రి రైతుల మధ్య ఏర్పడిన రహదారి వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామస్థుల కథనం ప్రకారం ముత్యాలమ్మ గుడికి వెళ్లే దారి పూర్వం నుంచి మా ముత్తాతలు ఇచ్చిన భూమి మాదే అంటూ రాత్రి 9 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ఇంటూరి నాగేశ్వరరావు అనే రైతు దారిని మూసివేస్తుండగా సమాచారం తెలిసిన కొందరు రైతులు దారి ముసివేయకుండా అడ్డుకున్నారు. సమస్య ఉంటే గ్రామ పెద్ద మనుషుల […]</p>

దిశ, పాలేరు: కూసుమంచి మండలంలోని కేశవాపురం గ్రామంలో మంగళవారం రాత్రి రైతుల మధ్య ఏర్పడిన రహదారి వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామస్థుల కథనం ప్రకారం ముత్యాలమ్మ గుడికి వెళ్లే దారి పూర్వం నుంచి మా ముత్తాతలు ఇచ్చిన భూమి మాదే అంటూ రాత్రి 9 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ఇంటూరి నాగేశ్వరరావు అనే రైతు దారిని మూసివేస్తుండగా సమాచారం తెలిసిన కొందరు రైతులు దారి ముసివేయకుండా అడ్డుకున్నారు. సమస్య ఉంటే గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుందామని రైతులు చెప్పారు.
కానీ ఇంటూరి నాగేశ్వరరావు అక్కడికి వచ్చిన ఇంటూరి మాధవరావు అనే రైతుతో గొడవకు దిగి దాడి చేయడంతో కుడి కంటిపై తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని అక్కడ ఉన్న రైతులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. మరో రైతు ఇంటూరి పుల్లయ్య కు ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ భూములకు అధికారుల పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో ఇంటూరి నాగేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా కూసుమంచి ఎస్ఐ నందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






