ఉత్తమ్‌కు కీలక పదవి.. రాష్ట్రం నుంచి ఆయనొక్కరే!

by  |
ఉత్తమ్‌కు కీలక పదవి.. రాష్ట్రం నుంచి ఆయనొక్కరే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డికి పార్టీ తరుఫున జాతీయ స్థాయిలో అవకాశం కల్పించారు. జాతీయ సమస్యలపై నిరంతర నిరసనలు తెలపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ ప్యానెల్‌కు అధ్యక్షత వహించనున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, లోక్‌సభ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ రిపున్ బోరా, మనీష్ చత్రథా, బీకే హరిప్రసాద్, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబేర్ ఖాన్‌లు కమిటీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 20నుంచి 30 వరకు ఉమ్మడిగా నిరసనలు, ర్యాలీ‌లు చేపట్టనున్నారు. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ అధ్యక్షతన విపక్ష పార్టీలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా కాంగ్రెస్​ పార్టీ కీలకంగా భావిస్తున్న ఈ కమిటీలో ఉత్తమ్‌కు అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కు మాత్రం చాన్స్​దక్కింది. నెల రోజుల కిందటే ఉత్తమ్‌ను టీపీసీసీ బాధ్యతల నుంచి తప్పించి రేవంత్​రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో ఉత్తమ్​పాల్గొంటున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి రేవంత్​రెడ్డితో విబేధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కు జాతీయ స్థాయిలో అవకాశం దక్కింది.


Next Story

Most Viewed