- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
25 ఏళ్లకు తిరిగొచ్చిన భర్త.. భార్య హతం!
<p>దిశ, వెబ్‌డెస్క్: పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఓ ప్రబుద్ధుడు భార్యను కర్రలతో కొట్టాడు. కర్రల దెబ్బలు తట్టుకోలేని వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని అమృతలూరు మండలం యలవర్రులో ఈ దారుణ హత్య జరిగింది. ఇదే గ్రామానికి చెందిన యప్రాలమ్మ, శ్యామ్యూల్ భార్యభర్తలు. కానీ, కుటుంబ కలహాలతో 25 సంవత్సరాల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి భార్య భాగోగులు చూడని భర్త శ్యామ్యూల్ ఇటీవల భార్య ఉంటున్న ఇంటికొచ్చాడు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఓ ప్రబుద్ధుడు భార్యను కర్రలతో కొట్టాడు. కర్రల దెబ్బలు తట్టుకోలేని వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని అమృతలూరు మండలం యలవర్రులో ఈ దారుణ హత్య జరిగింది.
ఇదే గ్రామానికి చెందిన యప్రాలమ్మ, శ్యామ్యూల్ భార్యభర్తలు. కానీ, కుటుంబ కలహాలతో 25 సంవత్సరాల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి భార్య భాగోగులు చూడని భర్త శ్యామ్యూల్ ఇటీవల భార్య ఉంటున్న ఇంటికొచ్చాడు. యప్రాలమ్మకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ డబ్బులను తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనికి ఆమె నిరాకరించడంతో కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. తండ్రి తమ తల్లి హత్యచేశాడని కొడుకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






