సరిహద్దుల్లో అంబులెన్సులను ఆపొద్దు : హైకోర్టు

77

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులను ఆపొద్దని పోలీసుశాఖను హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ షేషెంట్లు చనిపోతుంటే ఎలా నిలిపివేస్తారని మండిపడింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడంతో తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు వాహనాలను ఆపొద్దని స్పష్టంచేసింది. తమ ఉత్తర్వులు పట్టించుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకుముందు సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకోవడంపై అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తికి సమాధానమిచ్చారు.

రాష్ట్రంలోని సరిహద్దు ఆస్పత్రులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అధికారులు రివ్యూ నిర్వహించాకే ఈ మేరకు సరిహద్దుల్లో మెడికల్ వాహనాలను అడ్డుకుంటున్నట్లు తెలిపారు. అనుమతి ఉంటేనే ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అంబులెన్సుల ఎంట్రీకి అనుమతి ఇస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనూ అనుమతి ఉంటేనే రానిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో తెలంగాణ రోగులకు అనుమతి లేదని వెల్లడించారు. కాగా, విచారణ మధ్యలో ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కలుగజేసుకుని తమ వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను జూన్ 17కు హైకోర్టు వాయిదా వేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..