- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎందుకంత ప్రేమ చూపుతున్నారు : హైకోర్టు
<p>దిశ, వెబ్ డెస్క్: నిలోఫర్ ఆసుపత్రిలో పేషెంట్లకు భోజనం సరఫరా చేస్తున్న గుత్తేదారుపై ప్రభుత్వం ఎందుకంత ప్రేమ చూపుతుందని, కాంట్రాక్టర్‌ను అందరూ వెనకేసుకొస్తూ, ప్రేమ చూపిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా నిలోఫర్ ఆసుపత్రిలో సరఫరా చేస్తున్న భోజనంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఇటీవల హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కమిటీ 5 నెలల కింద నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించింది. వెంటనే కమిటీల నివేదికలపై నిర్ణయం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నిలోఫర్ ఆసుపత్రిలో పేషెంట్లకు భోజనం సరఫరా చేస్తున్న గుత్తేదారుపై ప్రభుత్వం ఎందుకంత ప్రేమ చూపుతుందని, కాంట్రాక్టర్‌ను అందరూ వెనకేసుకొస్తూ, ప్రేమ చూపిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాగా నిలోఫర్ ఆసుపత్రిలో సరఫరా చేస్తున్న భోజనంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఇటీవల హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కమిటీ 5 నెలల కింద నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించింది. వెంటనే కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అలాగే గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో ఈ గుత్తేదారు పనితీరును పరిశీలించాలని, ఆగస్టు 17లోగా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Next Story






