- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటు తుపాకీ మిస్‌ఫైర్.. బాలుడికి తగిలిన బుల్లెట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. సొలిశెట్టిపల్లి గ్రామంలో నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ముక్కుపచ్చలారని బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ వ్యక్తి అడవి పంది వేట కోసం నాటు తుపాకీ తీసుకొని వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో గురిపెట్టి పందిని కాల్చుతుండగా తుపాకీ గురి తప్పి పక్కనే ఆసక్తిగా తిలకిస్తున్న బాలుడు సుభాష్‌కు బుల్లెట్ తగిలింది. దీంతో తీవ్రగాయం అయ్యి పడిపోయిన బాలుడ్ని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. సొలిశెట్టిపల్లి గ్రామంలో నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ముక్కుపచ్చలారని బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ వ్యక్తి అడవి పంది వేట కోసం నాటు తుపాకీ తీసుకొని వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో గురిపెట్టి పందిని కాల్చుతుండగా తుపాకీ గురి తప్పి పక్కనే ఆసక్తిగా తిలకిస్తున్న బాలుడు సుభాష్‌కు బుల్లెట్ తగిలింది. దీంతో తీవ్రగాయం అయ్యి పడిపోయిన బాలుడ్ని స్థానిక వేలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వేటగాడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






