ఈ వయసులో అంత తెలివా.. బాలికా నువ్వు గ్రేట్

by  |
ఈ వయసులో అంత తెలివా.. బాలికా నువ్వు గ్రేట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్షత కొనసాగుతోంది. సమాజంలో ఇంకా అనేకచోట్ల చిన్నతనంలోనే బాలికలకు వివాహం చేసి పంపిస్తున్నారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా.. రోజు ఎక్కడో చోట బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని బాలికలను తన తల్లిదండ్రులు భారం దించేసుకోవాలని పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. అలా తాళి అనే బంధంలో గమ్యం తెలియని నావలో ప్రయాణం చేసి అలసిపోయిన బాలికలెందరినో మనం చూస్తుంటాం. అయితే, తాజాగా.. రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.

కానీ, పెళ్లి జరుగలేదు. సాక్షాత్తు పెళ్లి కూతురే తన వివాహాన్ని ఆపి ధైర్య సాహసాలు ప్రదర్శించింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 9వ తరగతి చదివే బాలికకు తన తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. బాలికకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఒప్పించి ఈ నెల డిసెంబర్ 11న పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతో బాలిక తెలివిగా ఆలోచించి తన పెళ్లి ఆపాలంటూ బాలల హక్కుల పరిరక్షణ సమితి హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. దీంతో వారు స్పందించి బాలిక వివాహాన్ని రద్దు చేశారు.



Next Story

Most Viewed