- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాన్ హోల్‌లో పడిన బాలిక
<p>దిశ, జవహార్ నగర్: ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న బాలిక అకస్మాత్తుగా మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్ పరిధిలోని మధురా నగర్ లో నివాసముంటున్న శ్రుతి (13) శుక్రవారం రాత్రి గం.9.30 ల సమయంలో పుట్ పాత్ పైన నడుచుకుంటూ షాపుకు వెళ్తున్న క్రమంలో మ్యాన్ హోల్ కవర్ పగిలి మ్యాన్ హోల్లో పడిపోయింది. స్థానికుల […]</p>

దిశ, జవహార్ నగర్: ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న బాలిక అకస్మాత్తుగా మ్యాన్ హోల్‌లో పడిపోయిన ఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మధు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సాకేత్ పరిధిలోని మధురా నగర్ లో నివాసముంటున్న శ్రుతి (13) శుక్రవారం రాత్రి గం.9.30 ల సమయంలో పుట్ పాత్ పైన నడుచుకుంటూ షాపుకు వెళ్తున్న క్రమంలో మ్యాన్ హోల్ కవర్ పగిలి మ్యాన్ హోల్లో పడిపోయింది.
స్థానికుల సమాచారంతో పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే శృతిని బయటకు తీసి రక్షించారు. భయబ్రాంతులకు గురైన శృతికి కానిస్టేబుల్ పవన్, డ్రైవర్ హోం గార్డ్ నర్సింగ్ లు మనోధైర్యాన్ని కల్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రత్యామ్నాయంగా వాహన తనిఖీ స్టాపర్ తో మ్యాన్ హోల్ ని కప్పారు. బాలికను కాపాడిన జవహార్ నగర్ పోలీసులను స్థానికులు అభినందించారు.






