మర్డర్ మిస్టరీలో చిక్కుకున్న పరిణీతి

by  |
మర్డర్ మిస్టరీలో చిక్కుకున్న పరిణీతి
X

దిశ, వెబ్‌డెస్క్ : కెరీర్‌ తొలినాళ్లలోనే ‘ఇషాక్ జాదే’ సినిమాతో నేషనల్ అవార్డ్ ( స్పెషల్ మెన్షన్) దక్కించుకున్న చబ్బీ బ్యూటీ పరిణీతి చోప్రా.. ఆ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలు చేయలేదనే చెప్పాలి. మళ్లీ ఇన్నాళ్లకు ‘ది గర్ల్ ఇన్ ద ట్రైన్’ మూవీలో పరిణీతికి ఇంటెన్స్ ఉన్న పాత్ర దక్కింది. రిబూ దాస్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీలో పరిణీతి, భర్త నుంచి విడాకులు తీసుకొని డిప్రెషన్‌కు గురయ్యే మహిళ పాత్రలో నటిస్తోంది. కాగా లేటెస్ట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌‌లో పరిణీతి స్పెల్‌బౌండింగ్ యాక్టింగ్‌‌ చూసిన అభిమానులు ఫిదా అవుతుండటం విశేషం.

పాలో హాకిన్స్‌ రచించిన ‘ది గర్ల్‌ ఇన్‌ ది ట్రైన్‌’ ఆధారంగా హాలీవుడ్‌లో 2016లో అదే పేరుతో సినిమా తెరకెక్కింది. ఇప్పుడు రిబూ దాస్ కూడా అదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ కాగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. పరిణీతి రైలు ప్రయాణం, డిప్రెషన్‌లో వస్తువులను పగలగొట్టడం, టెన్షన్‌తో పరుగులు పెడుతుండటంతో పాటు ఆమె ఒంటినిండా గాయాలు ఉండటాన్ని టీజర్‌లో చూపించారు. కాగా ఆయా సీన్లలో పరిణీతి నటన చాలా అద్భుతంగా ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే పరిణీతి అనుకోకుండా ఓ మర్డర్ మిస్టరీలో చిక్కుకోనుండగా.. ఆ సంఘటన తన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? అసలు తనకు, ఆ మర్డర్‌కు సంబంధం ఉందా? హత్యకు గురైంది ఎవరు? పరిణీతి డిప్రెషన్ నుంచి బయటపడుతుందా? లేదా? అన్నదే తెరమీద చూడాల్సిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.


Next Story