- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమర్శల పాలవుతున్న 'మమతా'నుబంధం..!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే చాలు.. ఏ బంతిలో కూర్చున్నా సరే అనే మాటలను బల్దియా అధికారులు మరోసారి నిరూపిస్తున్నారు. గతంలో పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నా జీహెచ్ఎంసీ అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. ఓ అధికారి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తన తండ్రి మరణించడంతో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ ఈ నెల 26 వరకు సెలవుపై వెళ్లారు. ఆయన […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే చాలు.. ఏ బంతిలో కూర్చున్నా సరే అనే మాటలను బల్దియా అధికారులు మరోసారి నిరూపిస్తున్నారు. గతంలో పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నా జీహెచ్ఎంసీ అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. ఓ అధికారి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తన తండ్రి మరణించడంతో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ ఈ నెల 26 వరకు సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమతకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం ఆదేశారు జారీ చేశారు. రవికిరణ్ తిరిగి విధుల్లో చేరేంతవరకూ మమతనే సాధారణ విధులను కూడా నిర్వర్తిస్తారని అందులో పేర్కొన్నారు.
జోనల్ కమిషనర్ సెలవుపై వెళితే స్వయంగా కమిషనర్ అడిషనల్ చార్జ్ తీసుకోవచ్చు. లేదా ప్రధాన కార్యాలయంలోని ఐఏఎస్ ఆఫీసర్లలో ఎవరికైనా అప్పగించొచ్చు. శేరిలింగంపల్లి పక్కనే ఉన్న కారణాన్ని పరిగణలోకి తీసకున్నా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌కు కూడా ఈ బాధ్యతలు అప్పగించవచ్చు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ప్రియాంక ఐఏఎస్ కూడా. బల్దియా అధికారులు ఎన్నికల డ్యూటీల్లో బిజీగా గడుపుతున్న సమయంలో సీనియర్, ఐఏఎస్ అధికారులను పక్కన బెట్టి మమతకే బాధ్యతలు అప్పగించడం వెనక అసలు కిటుకు వేరే ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. గతంలోనూ మమత స్వయంగా పలు వివాదాల్లో చిక్కుకోగా ఆమె పట్ల జీహెచ్ఎంసీ అనుసరించే ప్రత్యేక వ్యవహారం కూడా విమర్శల పాలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో సీనియారిటీ ప్రకారంగా 20 స్థానాలు ముందున్న అధికారులను పక్కన బెట్టి మమతకు జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం లో సీనియర్ అధికారులతో పాటు ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్లు సైతం ఆమెపట్ల అసంతృప్తిగా ఉన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకురాలిగా ఉండడంతో ఎవరూ బయట పడటం లేదు. పదుల సంఖ్యలో జీహెచ్ఎంసీ అధికారులు, ఐఏఎస్ కమిషనర్లను సైతం పక్కన బెట్టి ఫుల్ చార్జ్ బాధ్యతలను మమతకు అప్పజెప్పడం వెనుక అధికార పార్టీ వ్యూహం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన ఎన్నికల తరుణంలో జీహెచ్ఎంసీలో ఉన్న ఇతర అధికారులను పక్కనబెట్టి మమతకు మాత్రమే ఫుల్ చార్జ్అప్పజెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌తో పాటు హెడ్ ఆఫీస్‌లోని సీనియర్, ఇద్దరు ఐఏఎస్‌లతో పాటు పలువురు సీనీయర్ అధికారులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలరు. మమతపైనే బల్దియా ఉన్నతాధికారి మమకారం ప్రదర్శించడం ఇదేమీ మొదటిసారి కాదు. మమతకు అధికార పార్టీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రస్తుత బాధ్యతల అప్పగింత ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.






