సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

by  |
సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు భారీగా వరదనీరు చేరి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సాగర్‌కు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 74,217 క్యూసెక్కులు ఉండగా, అధికారులు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అంతే మోతాదులో దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామార్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను… 589.60 అడుగులకు చేరింది.


Next Story

Most Viewed